Burgampadu: మద్యం మత్తులో యువకుల వీరంగం, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ధ్వంసం!
Burgampadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో మద్యం మత్తులో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌పై దాడి చేసి వీరంగం సృష్టించిన యువకులు. కలకలం రేపిన ఘటన.
Burgampadu: మద్యం మత్తులో యువకుల వీరంగం, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ధ్వంసం!
Burgampadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో మద్యం మత్తులో కొంతమంది యువకులు హల్‌చల్ సృష్టించిన ఘటన కలకలం రేపింది.
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో మద్యం సేవించిన యువకులకు అక్కడ పనిచేస్తున్న సప్లయర్‌కు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. దీంతో మద్యం మత్తులో ఉన్న యువకులు రెచ్చిపోయి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోని సామగ్రిని విరగ్గొడుతూ వీరంగం సృష్టించినట్లు తెలుస్తోంది.
యువకుల హంగామాతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మద్యం మత్తులో బహిరంగ ప్రదేశాల్లో ఇలా హల్‌చల్ చేస్తూ, వ్యాపార సంస్థలపై దాడులకు పాల్పడుతున్న ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




