Karakagudem: బిఆర్ఎస్ పార్టీ నుంచి ఉపసర్పంచ్ బుడగం రాము సస్పెన్షన్!
Karakagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి, ఉపసర్పంచ్ బుడగం రాముని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానం చేశారు.
Karakagudem: బిఆర్ఎస్ పార్టీ నుంచి ఉపసర్పంచ్ బుడగం రాము సస్పెన్షన్!
Karakagudem: ఈరోజు అనగా 18-10-2026వ తారీఖున కరకగూడెం మండలం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ల ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి గ్రామ శాఖ అధ్యక్షులతో పాటు పార్టీ ఇన్చార్జి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ని సందర్శించి ఓటు నమోదు అయ్యే విధంగా కృషి చేయాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున కోరడమైనది.
అందులో భాగంగా కరకగూడెం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ మరియు BRS పార్టీ మండల కార్యదర్శిగా చలామణి అవుతూ పార్టిక కార్యక్రమాలను దూరంగా ఉంటూ పార్టీపై వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పడుతూ అనేక విమర్శలు చేస్తునందున పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయించడం తీసుకోవడం జరిగింది.
ఈరోజు పార్టీ కార్యక్రమంలో అతనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తూ ఇట్టి తీర్మానాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు పినపాక మాజీ శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారికి తీర్మానం చేసి పంపడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డిగారు,మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబుగారు,రావుల కనకయ్య గారు,సర్పంచ్ కొమరం సత్యనారాయణ గారు,మాజీ సర్పంచ్లు పాయం నరసింహారావుగారు,ఊకే రామనాథం గారు, గొగ్గలి నారాయణగారు,గొగ్గలి నరసయ్యగారు,కరకగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు కటకం లేనిన్గారు,ఈసం సమ్మయ్యగారు,సీనియర్ నాయకులు గోగ్గాలి నర్సయ్య గారు,ఎళ్ళు రామకృష్ణారెడ్డిగారు,వట్టం వెంకటేశ్వర్లు గారు,గొగ్గలి నారాయణగారు,ఎగ్గడి శ్రీనివాస్ గారు వైద బిక్షపతిగారు,చిట్టీమల్ల ప్రవీణ్ గారు,సయ్యద్ పాషాగారు,దాసరి సాంబయ్యగారుతదితరులు పాల్గొన్నారు.




