Manuguru: 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ విషం చిమ్మడం తగదు: కాంగ్రెస్ నేతలు!

Manuguru: ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మణుగూరు కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు పీరినాకి నవీన్, కురం రవి బుధవారం విమర్శించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 18 Nov 2026 9:42 PM IST
Manuguru
X

Manuguru: 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ విషం చిమ్మడం తగదు: కాంగ్రెస్ నేతలు!

మణుగూరు: మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పట్టణ అధ్యక్షులు పీరినాకి నవీన్, కురం రవి లు మాట్లాడుతూ... బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై మూర్ఖంగా గుడ్డిగా 6 గ్యారంటీలపై విషం చిమ్మడం సిగ్గులేని పని ప్రజాపాలన ప్రభుత్వం కొత్తగా చేయూత పెన్షన్,ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా అమలు చేస్తున్నారు.

క్రమంలో మండలంలో మా పరిస్థితి మా బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే అయోమయం లొ ప్రజలను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించాలని చూస్తున్న నాయకులారా కళ్ళు తెరవండి మీ బ్రమలను పక్కకు పెట్టి అమలవుతున్న మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, సన్నబియ్యం, బిసి డిక్లరేషన్, రైతు రుణమాపీ, చేయూత పెన్షన్, నిరుద్యోగులకు సుమారు 80.000 పైగా ఉద్యోగాలు, హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జ్ ల పెంపు ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే సిగ్గులేకుండా ఆరోపణలు చేయడం దారుణం దమ్ముంటే ప్రజల్లో అరుగ్యారెంటీ ల పై చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అని మీ పాలనలో ప్రజలకు ఏం చేసారో చెప్పాలి అని ఇప్పటి కైనా తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చుస్తే ప్రజలు మిమ్ముల్ని తరిమి కొడతారు అని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు పీరినాకి నవీన్,టౌన్ అధ్యక్షులు కురం రవి,జిల్లా కార్యవర్గసభ్యులు సారాంపల్లి రాంరెడ్డి,బోనగిరి శివ సైదులు,ఉపసర్పంచ్ గాండ్ల సురేష్, మైనార్టీ అధ్యక్షులు రహీమ్ పాషా, ఎస్సి సెల్ టౌన్ అధ్యక్షులు పొడుతూరి రవి, శివాలయం గుడి మాజీ చైర్మన్ కూచుపూడి బాబు,టౌన్ నాయకులు చింతల కృష్ణ, పొడుతూరి నానాజీ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA