Manuguru: మణుగూరులో అసంపూర్తి రహదారిపై బీఆర్ఎస్ రాస్తారోకో, ధర్నా!

Manuguru: మణుగూరు అంబేద్కర్ సెంటర్‌లో అసంపూర్తి రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాస్తారోకో నిర్వహించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 14 Oct 2026 1:21 PM IST
Manuguru
X

Manuguru: మణుగూరులో అసంపూర్తి రహదారిపై బీఆర్ఎస్ రాస్తారోకో, ధర్నా!

Manuguru: మణుగూరు పట్టణంలోని అసంపూర్తిగా ఉన్న ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు నేతృత్వంలో మణుగూరు అంబేద్కర్ సెంటర్‌లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.

ప్రధాన రహదారి దుస్థితి కారణంగా ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రహదారి మరమ్మతులు చేపట్టి రాకపోకలను సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA