Kothagudem: పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన రాకేష్ రెడ్డి!

Kothagudem: కొత్తగూడెంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించిన బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి, అర్హులంతా ఓటర్లుగా నమోదు కావాలని పిలుపు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 6 Oct 2026 10:20 AM IST
Kothagudem
X

Kothagudem: పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన రాకేష్ రెడ్డి!

Kothagudem: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి అవగాహన కల్పించారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి ఓటరు నమోదుపై వివరించారు.

ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై పోరాడుతున్నానన్నారు. పట్టభద్రుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. గత మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతోందని తెలిపారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు భిన్నమైనవని, విద్యావంతులు, మేధావులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్న ఎన్నికలని పేర్కొన్నారు. డిగ్రీ పూర్తిచేసి మూడేళ్లు పూర్తైన అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఫామ్-18 ద్వారా లేదా తెలంగాణ ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకావలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, సంకు బాపన అనుదీప్, మూడు జయరాం , చింతలపూడి జగన్, రమాకాంత్,రాజేష్ తదితర బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM