Sathupalli: పాకలగూడెంలో బీజేపీ ‘అంగన్ మిలన్ సేవా’!

Sathupalli: సత్తుపల్లి పాకలగూడెంలో బీజేపీ ‘అంగన్ మిలన్ సేవా’ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, కేంద్ర ప్రభుత్వ టీకాలు, పీఎంఎంవీవై పథకాలపై విస్తృత అవగాహన.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 29 Sept 2026 10:10 PM IST
Sathupalli
X

Sathupalli: పాకలగూడెంలో బీజేపీ ‘అంగన్ మిలన్ సేవా’!

సత్తుపల్లి: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా “అంగన్ మిలన్ సేవా” కార్యక్రమాన్ని సత్తుపల్లి మండల అధ్యక్షులు సాలి శివకృష్ణ ఆధ్వర్యంలో, మండల ఉపాధ్యక్షులు ఎస్.కె. సుభాని అధ్యక్షతన పాకలగూడెం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా సత్తుపల్లి మండల అధ్యక్షులు సాలి శివకృష్ణ మరియు బీజేపీ ఖమ్మం జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్.కె. రహమతుల్లా మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న పోషకాహారం, ఆరోగ్య సేవలు, టీకాలు మరియు బాలల అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.

అంగన్‌వాడీ కేంద్రంలోని టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, మహిళలు మరియు చిన్నారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిషన్ ఇంద్రధనుష్ ద్వారా చిన్నారులు, గర్భిణీలకు అందుతున్న టీకాల ప్రాధాన్యతను, ప్రధానమంత్రి మాతృ వందన యోజన (PMMVY) ద్వారా అర్హత కలిగిన గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సహాయాన్ని వివరించారు.

అలాగే HPV టీకా కార్యక్రమంపై కూడా అవగాహన కల్పిస్తూ, బాలికల ఆరోగ్య పరిరక్షణలో టీకాల ప్రాధాన్యతను వివరించారు. “ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన బిడ్డ బలమైన భారత్” అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య, సంక్షేమ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI