Julurpad: ఉమ్మడి ఖమ్మం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి!

Julurpad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో జరిగిన బీజేపీ సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 29 Nov 2026 7:41 AM IST
Julurpad
X

Julurpad: ఉమ్మడి ఖమ్మం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి!

Julurpad: జూలూరుపాడు గ్రామంలో ఎమ్మెల్సీ ఓటర్లు మరియు సంస్థ గత విషయాలు పైన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఓట్లు చేర్పులకు డిసెంబర్ పదో తేదీ వరకు అవకాశం ఉన్నది కావున బిజెపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎమ్మెల్సీ ఓట్లు ప్రతి గ్రామంలో చేర్చాలి.

కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇవ్వటం అమలు గాని హామీలు ఇవ్వడం కొత్త పథకాల పేరుతో ఓటర్లు మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కరువు ప్రాంతంగా ప్రకటించకుండా కొన్ని మండలాలు మాత్రమే ప్రకటించడం ఇది అన్యాయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని మండలాలు కూడా కరువు మండలాలు ప్రకటించాలి.

ఇంతవరకు కరువు మండలాలకు ఎటువంటి సహాయ సహకారాలు గాని ఆర్థిక నిధులు విడుదల చేయటం గాని రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, రైతులకు బ్యాంకు రుణాలు మాఫీ చెయ్యాలి రైతు భరోసా, వ్యవసాయ కూలీల భరోసా నిధులు రైతుల ఖాతాలలో మరియు కూలీల ఖాతాల్లో డబ్బులు వేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.

కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ కూడా అమలు చేయాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేసినారు.

ఈ కార్యక్రమంలో బిజెపి వైరా నియోజకవర్గ ఫుల్ టైమర్ కొండి ప్రభాకర్, బిజెపి మాజీ మండల అధ్యక్షులు సిరిపురపు ప్రసాద్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరు రామారావు, సిరిపురపు గోపాలరావు, నర్వనేని కృష్ణ, కొండ సత్యనారాయణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU