Kothagudem: కొత్తగూడెంలో బీజేపీ పట్టభద్రుల ఓటు నమోదు

Kothagudem: కొత్తగూడెం ఏబీవీపీ కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 1 Nov 2026 4:26 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో బీజేపీ పట్టభద్రుల ఓటు నమోదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఓటరు ఎన్రోల్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఏబీవీపీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులకు ఆన్‌లైన్ ద్వారా ఓటరు నమోదు చేయించారు. ప్రతి పట్టభద్రుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ అవగాహన కల్పించారు.

కొత్తగూడెం పట్టణంలోని ప్రతి అర్హుడైన పట్టభద్రుడిని చేరుకోవడం, ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతం చేయడం, బూత్ స్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆదిమూల రాములు, కనుకుంట్ల రాజమొగిలి, రాయుడు నాగేశ్వరరావు, పట్టణ నాయకులు భాస్కర్ గౌడ్, గిరి, రవి, చంద్రగిరి రమేష్, మహిళా నాయకురాళ్లు భూక్యా పూర్ణ, యామిని, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM