Bhadrachalam: భద్రాచలం అయ్యప్ప సన్నిధిలో 3,000 మంది స్వాములకు భిక్ష!
Bhadrachalam: భద్రాచలం హరిహర క్షేత్రం అయ్యప్ప సన్నిధిలో మండల పూజల ప్రారంభం సందర్భంగా సోమవారం 3,000 మంది అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమం నిర్వహించారు.
Bhadrachalam: భద్రాచలం అయ్యప్ప సన్నిధిలో 3,000 మంది స్వాములకు భిక్ష!
భద్రాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల హరి హర క్షేత్రం శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఈరోజు నుంచి మండల పూజలు ప్రారంభం సందర్భంగా 3000 మంది అయ్యప్ప దీక్షాపరులకు బిక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క బిక్షా కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రుద్రరాజు సత్యనారాయణ రాజు రాణి దంపతులు, పచ్చమట్ల అశోక్ కుమార్ రాజు దీప్తి దంపతులు మరియు వేగేశ్న కృష్ణ చైతన్య కీర్తి దంపతులకు అయ్యప్ప పరులు కృతజ్ఞతలు తెలిపారు.
సాయంత్రం ఏడు గంటలకు నుండి 18 మెట్ల మహా పడిపూజ కార్యక్రమం ఉందని అయ్యప్ప కమిటీ వారు తెలిపారు. ఈ యొక్క మహా పడిపూజకు అయ్యప్ప దీక్షపరులు, శివదీక్ష బరులు దుర్గ మాత దీక్ష పరులు శ్రీరామ దీక్ష పరులు సాయిబాబా దీక్షపరులు అందరూ రావాలని భద్రాచల హరిహర క్షేత్ర శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం కమిటీ కోరింది.




