Kothagudem: భట్రాజ్ భవనానికి స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యేకు వినతి

Kothagudem: కొత్తగూడెంలో భట్రాజ్ సంఘ భవన నిర్మాణానికి స్థలం, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 2 Nov 2026 5:32 PM IST
Kothagudem
X

Kothagudem: భట్రాజ్ భవనానికి స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యేకు వినతి

కొత్తగూడెం: ఆర్థికంగా వెనుకబడిన భట్రాజు సంఘం అభివృద్ధికి, సంఘ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును విద్యానగర్‌లోని ఆయన నివాసంలో కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం భట్రాజులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, కొత్తగూడెంలో ప్రభుత్వ స్థలాన్ని భట్రాజ్ సంఘ భవన నిర్మాణానికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందిస్తూ.. సంఘ భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించే విషయంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో భట్రాజు

సంఘం జిల్లా అధ్యక్షులు సరస్వతి చలపతి రాజు, కార్యదర్శి రామచంద్రరాజు, సుధాకర్ రాజు, నారాయణరాజు, రవీందర్ రాజు, శ్రీనివాసరాజు, రమణ రాజు, సరికొండ కృష్ణప్రసాద్, ఉమా జగన్, జగన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM