Palvancha: పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఎస్పీ రోహిత్ రాజు!
Palvancha: భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు పాల్వంచ పెద్దమ్మతల్లిని దర్శించుకుని పూజలు చేశారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Palvancha: పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఎస్పీ రోహిత్ రాజు!
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు మంగళవారం పాల్వంచలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవస్థాన సంప్రదాయం ప్రకారం వేదపండితులు, అర్చకులు ఎస్పీకి స్వాగతం పలికారు. దర్శనం, పూజల అనంతరం అర్చకులు వేదాశీర్వచనం అందించి, అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాన్ని అందజేశారు.
అనంతరం ఎస్పీ ఆలయ పరిసరాలను పరిశీలించారు. దసరా పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఆలయ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, భద్రతా చర్యలను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు.




