Kothagudem: కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాటుకు గురై రెండు ఆవులు మృతి!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఊర్లదాసుపల్లిలో పిడుగుపడి రెండు ఆవులు మృతి చెందాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

G Ravi, Bhadradri
Published on: 20 Sept 2026 11:51 AM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాటుకు గురై రెండు ఆవులు మృతి!

Kothagudem: కృష్ణసాగర్ పంచాయతీ పరిధిలోని ఊర్లదాసుపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిన్న అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం కురుస్తుండగా పిడుగు పడటంతో రెండు ఆవులు మృతి చెందాయి.

భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పిడుగుపాటుతో పశువులను కోల్పోయిన బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri