Kothagudem: కార్తీక పౌర్ణమి వేళ వైభవంగా సహస్ర దీపాలంకరణ సేవ!
Kothagudem: కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ వేడుకలు ఘనంగా జరిగాయి.
Kothagudem: కార్తీక పౌర్ణమి వేళ వైభవంగా సహస్ర దీపాలంకరణ సేవ!
కొత్తగూడెం: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ విశేష పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
హరిహరులకు ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి రోజున ఆలయ మండపంలో సహస్ర దీపాలంకరణ సేవను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
అనంతరం ఆలయ అర్చకులు మరిగంటి శాయి గోపాలాచార్యుల బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవ యొక్క ఆధ్యాత్మిక విశిష్టతను భక్తులకు వివరించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.




