Kothagudem: కొత్తగూడెంలో నేడు ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్మ దీక్ష.. భారీ మద్దతు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద టీఎస్ సీపీఎస్ ఈయూ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు ధర్మ దీక్ష చేపట్టనున్నారు.
Kothagudem: కొత్తగూడెంలో నేడు ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్మ దీక్ష.. భారీ మద్దతు!
కొత్తగూడెం: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం (నవంబర్ 17) కొత్తగూడెంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ధర్మ దీక్ష చేపట్టనున్నారు. టీఎస్ సీపీఎస్ ఈయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని ధర్నా చౌక్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
2023 నవంబర్ 17న హన్మకొండలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్మ దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ధర్మ దీక్షకు మద్దతుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయశాఖ ఉద్యోగులు ముందుకొచ్చారు. కొత్తగూడెం జిల్లా కోర్టు వెలుపల సన్నాహక సమావేశం నిర్వహించి కార్యక్రమానికి తమ మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో పలువురు జ్యుడీషియల్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




