Kothagudem: సైబర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: ఎస్పీ రోహిత్ రాజు!
Kothagudem: సైబర్ నేరాల బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సత్వర న్యాయం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సైబర్ వారియర్స్‌ను ఆదేశించారు.
Kothagudem: సైబర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: ఎస్పీ రోహిత్ రాజు!
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 24: సైబర్ నేరాల బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సైబర్ వారియర్స్‌ను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పెండింగ్ కేసుల దర్యాప్తు, ఫిర్యాదుల పరిష్కారం, పోర్టళ్ల వినియోగం, పీటీ వారెంట్ల అమలుపై సమీక్షించారు.
బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు.
ఎన్‌సీఆర్‌పీ, జీఆర్‌ఎం, ఎంఆర్‌ఎఫ్, సహయోగ్, సమన్వయ, సైబర్ క్రైమ్ అనలిటిక్స్ అండ్ ప్రాసిక్యూషన్ సిస్టమ్ పోర్టళ్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. 1930 సైబర్ హెల్ప్‌లైన్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, ఆర్థిక మోసాల బాధితులకు సహాయం అందించాలన్నారు.
పెండింగ్ పీటీ వారెంట్ల అమలును వేగవంతం చేసి, వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో సైబర్ సెల్ సీఐ నరేష్, ఎస్సై జుబేదా బేగం, డిఫోర్సి సిబ్బంది, సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.




