Kothagudem: 'నిర్లక్ష్యం' షార్ట్ ఫిలిం విడుదల చేసిన ఎస్పీ రోహిత్ రాజు!
Kothagudem: హెల్మెట్ ప్రాధాన్యతను తెలియజేస్తూ రూపొందించిన 'నిర్లక్ష్యం' షార్ట్ ఫిలింను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 70MM యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు.
Kothagudem: 'నిర్లక్ష్యం' షార్ట్ ఫిలిం విడుదల చేసిన ఎస్పీ రోహిత్ రాజు!
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెల్మెట్ ప్రాధాన్యతను తెలియజేసే నిర్లక్ష్యం షార్ట్ ఫిలిం ను 70MM యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ షార్ట్ ఫిలిం బాగుందని, సన్నివేశాలన్నీ సహజసిద్ధంగా ఉన్నాయని, నటీనటులు చక్కగా నటించారని ప్రశంసించారు.
టీం సభ్యులు ఏం చేస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందరూ షార్ట్ వీడియోస్ చూస్తున్నారని, తక్కువ సమయంలో సందేశం ఇచ్చేలా, సమాజాన్ని చైతన్యపరిచే షార్ట్ ఫిలింలు తీయాలని సూచించారు.
10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం మొత్తం చూసి ప్రతి సన్నివేశాన్ని, ప్రతి ఆర్టిస్టును అబ్జర్వ్ చేసి దర్శకుడు శ్రీనివాస్ దొడ్డ పనితీరు బాగుందని, లోటుపాట్లను కూడా తెలియజేశారు.
అనంతరం టీం సభ్యులు ఎస్పీని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస్ దొడ్డ, నటీనటులు జలాల్, ఆవుదుర్తి సతీష్, ప్రేమ్ సాగర్ బాబు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.




