Kothagudem: బియ్యం దుకాణాల్లో ధరల పట్టిక తప్పనిసరి: అదనపు కలెక్టర్!
Kothagudem: కొత్తగూడెంలో బియ్యం దుకాణాలపై అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తనిఖీలు చేపట్టారు. ధరల పట్టికలు ప్రదర్శించకుంటే 6A కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Kothagudem: బియ్యం దుకాణాల్లో ధరల పట్టిక తప్పనిసరి: అదనపు కలెక్టర్!
కొత్తగూడెం: కమీషనర్ సివిల్ సప్లైస్, హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని కొత్తగూడెం పట్టణంలో వివిధ బియ్యం విక్రయించే దుకాణాల ను అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ మరియు D.M (సివిల్ సప్లయ్), D.Ts D. శంకర్ రావు (కొత్తగూడెం), జి. ప్రభాకర్ (మణుగూరు), జి. రాజులు (అశ్వారావుపేట)మరియు ఎం. రాజేశ్వరరావు (భద్రాచలం) వారు తనిఖీలు నిర్వహించి ప్రతి దుకాణం యందు ధరల పట్టికను పెట్టి అట్టి పట్టికలో నిర్ణయించిన ధరల ప్రకారం వినియోగదారులకూ విక్రయించే విధముగా ఆదేశాలు జారీ చేయటం జరిగింది.
దీనిని అతిక్రమించిన యెడల నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం 6A కేసులు నమోదు చేస్తామని హెచ్చరించటం జరిగినది. ఆదే విధముగా వినియోగదారులు కూడా ఎవరైనా బియ్యం దుకాణాదారులు అధిక ధరలకు విక్రయించి నట్లు అయితే సివిల్ సప్లైస్ అధికారుల కు పిర్యాదు చేయ వలసినదిగా తెలియ జేయ నైనది మరియు జిల్లలోనీ మిగత రైస్ దుకాణదారులు అందరు కూడా ధరల పట్టిక ను ఏర్పాటు చేసి, ఆయా ధరల ప్రకారం విక్రయించవలసినదిగా ఆదేశించినారు.




