Kothagudem: రామవరం ప్రజలకు జీవో 76 పట్టాలివ్వాలి: ఏఐవైఎఫ్!

Kothagudem: రామవరం పేదలకు జీవో 76 ప్రకారం ఇంటి పట్టాలు ఇవ్వాలని కొత్తగూడెం మేయర్ గణేష్‌కు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే ఫహీమ్ దాదా వినతిపత్రం అందజేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 14 Oct 2026 9:26 PM IST
Kothagudem
X

Kothagudem: రామవరం ప్రజలకు జీవో 76 పట్టాలివ్వాలి: ఏఐవైఎఫ్!

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద ప్రజలకు GO 76 ద్వారా ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ AIYF జిల్లా కార్యదర్శి SK ఫహీమ్ దాదా కొత్తగూడెం మేయర్ గణేష్ కు మెమోరాండం సమర్పించారు.

ఈ సందర్భంగా ఫహీమ్ దాదా మాట్లాడుతూ రామవరం ప్రాంతంలో అనేక కుటుంబాలు తమ కష్టార్జితంతో ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నా, చట్టబద్ధమైన హక్కు పత్రాలు లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి స్థలంపై హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.

కావున ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, సంబంధిత రెవెన్యూ అధికారులు రామవరంలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న అర్హులైన ప్రతి కుటుంబం వివరాలు, ఇంటి నంబరు, యజమాని పేరు, నివాస వివరాలతో జాబితా రూపొందించి, GO 76 నిబంధనల ప్రకారం పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

పేద ప్రజలు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న తమ ఇళ్లకే హక్కు లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్కే ఖయ్యూం ,హనీఫ్,రవి, చిన్న అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM