Palwancha: పాల్వంచ పెద్దమ్మగుడిలో హుండీ ఆదాయం రూ. 29.28 లక్షలు
Palwancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పెద్దమ్మగుడి హుండీలను లెక్కించగా 110 రోజులకు గాను రూ.29,28,083 నగదుతో పాటు బంగారం, వెండి, విదేశీ నోట్లు ఆదాయంగా లభించాయి.
Palwancha: పాల్వంచ పెద్దమ్మగుడిలో హుండీ ఆదాయం రూ. 29.28 లక్షలు
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, కేశవాపురం -జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి) లో భక్తులు వేసిన మొక్కులు, కానుకలు గల హుండీలను ఈ రోజు విప్పి లెక్కించగా తేదీ: 30-07-2026 నుండి 20-11-2026 వరకు 110 రోజులకు గాను మొత్తం రూ. 29,28,083/- (అక్షరాల ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనభై మూడు రూపాయలు మాత్రమే) వచ్చినవి.
అదేవిధముగా హుండీలలోని తేదీ: 30-07-2026 మరియు తేదీ: 20-03-2026 మరియు తేదీ: 20-11-2026 మిశ్రమ బంగారము 038 గ్రా॥ 595 మి॥ గ్రా॥ మరియు వెండి 907 గ్రా॥ 546 మి॥ గ్రా॥ రాబడినవి. విదేశీ నోట్లు అమెరికా ఒక డాలర్ నోట్టు-1, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1 దిర్హమ్స్ ఒక నోటు మొత్తం 2 విదేశీ నోట్లు వచ్చినవి. అదేవిధముగా హుండీలలో వెలసిన మిశ్రమ బంగారము, వెండి వాటిని మూటకట్టి సీలు వేసి ఆంధ్రాబ్యాంక్ లాకర్ నందు భద్రపరచడమైనది.
ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వాహణాధికారి శ్రీ ఎ. విజయ్‌కుమార్, కొత్తగూడెం డివిజన్ పరిశీలకులు శ్రీ కె. ఆనంద్ గార్ల పర్యవేక్షణలో నిర్వహించబడినది. ఇట్టి లెక్కింపులో జగన్నాధపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి బానోత్ అనిత, దేవస్థాన ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ శ్రీ బాలినేని నాగేశ్వరరావు, ధర్మకర్తలు, యూనియన్ బ్యాంక్ మేనేజర్, స్టాఫ్, రూరల్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసు సిబ్బంది, వివిధ సేవా సంస్థ వారు మొత్తం 100 మంది మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.




