Kothagudem: మురసు తుఫాను ప్రభావం కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు!
Kothagudem: మురసు తుఫాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు. పెనగడప పెద్ద చెరువు అలుగు పరుగు. లో-లెవెల్ బ్రిడ్జిపై వరద నీరు, రాకపోకలు బంద్.
Kothagudem: పెనగడప నుండి ములుగు గూడెం పాలవాగు గడ్డిగుప్ప మర్రిగూడెం గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎటువంటి ప్రాణాపాయం సంభవించకుండా టూ టౌన్ పోలీసులు బందోబస్తు చేపట్టారు. గ్రామస్తులు తమ ట్రాక్టర్లను అడ్డుపెట్టి అటువైపు ఇటువైపు ఎవరు వెళ్లకుండా హెచ్చరికలు చేస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు పొంగుతున్న పరిస్థితులలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు, ఎస్పీ ఆదేశాల మేరకు పొంగుతున్న వాగులు బ్రిడ్జిల వద్ద ప్రజలు వాగులు వంకలు పొంగుతున్న లో లెవల్ బ్రిడ్జి, చప్టాలపై నుండి రాకపోకలు నిలిపి వేసి ప్రజలను అప్రమత్తం చేస్తూ పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు.




