Mulakalapally: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేదలకు కొండంత అండ: సర్పంచ్ రవి!

Mulakalapally: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా రూ.5 లక్షల పథకం దరఖాస్తుల నమోదు శిబిరాన్ని ములకలపల్లి మండలం పోగల్లపల్లి సర్పంచ్ మడకం రవి ప్రారంభించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 21 Nov 2026 11:45 AM IST
Mulakalapally
X

Mulakalapally: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేదలకు కొండంత అండ: సర్పంచ్ రవి!

ములకలపల్లి: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా రూ.5 లక్షల బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రత్యేక శిబిరాన్ని శుక్రవారం పోగల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మడకం రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మడకం రవి మాట్లాడుతూ... కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కుకు అనుకోని ఆపద సంభవిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే సదుద్దేశంతో ప్రజా ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. 18 నుండి 59 ఏళ్ల వయస్సు గల అర్హులైన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తదితర అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకుని, ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN