Mulakalapally: డిసెంబర్ 29న ప్రజా గర్జన - ఛలో హైదరాబాద్: మాస్ లైన్ పిలుపు!

Mulakalapally: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 29న నిర్వహించే ప్రజా గర్జన - ఛలో హైదరాబాద్ సభను విజయవంతం చేయాలని కెచ్చెల రంగారెడ్డి పిలుపునిచ్చారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 21 Nov 2026 11:43 AM IST
Mulakalapally
X

Mulakalapally: డిసెంబర్ 29న ప్రజా గర్జన - ఛలో హైదరాబాద్: మాస్ లైన్ పిలుపు!

ములకలపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రజా గర్జన - ఛలో హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కెచ్చెల రంగారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని రాచన్నగూడెంలో శుక్రవారం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పోతుగంటి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. పెండింగ్ పింఛన్లు, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, కౌలు రైతులకు భరోసా, ఖాళీ ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించడంతో పాటు ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం, సహాయ కార్యదర్శి నాయిని రాజు, స్థానిక సర్పంచి మడకం విజయ, ఉప సర్పంచి వగ్గెల వెంకటేష్, నాయకులు కెచ్చెల కల్పన, అమర్లపూడి రాము, నూపా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN