Kothagudem: కొత్తగూడెంలో వైభవంగా కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం వేడుకలు!
Kothagudem: కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తగూడెం ఎంజీ రోడ్డులోని శ్రీ విజయ విఘ్నేశ్వర, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాల్లో ప్రత్యేక అభిషేకాలు, జ్వాలా తోరణం జరిగాయి.
Kothagudem: కొత్తగూడెంలో వైభవంగా కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం వేడుకలు!
కొత్తగూడెం: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం ఎంజీ రోడ్డులోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. రాత్రి 7 గంటలకు సంప్రదాయబద్ధంగా కార్తీక జ్వాలా తోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలు జరిగాయి.
ఈ పర్వదిన వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.




