Manuguru: మణుగూరులో దారుణం: చేతబడుల నెపంతో ఇద్దరి హత్య!
Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పరిధిలో మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేసి పాతిపెట్టారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Manuguru: మణుగూరులో దారుణం: చేతబడుల నెపంతో ఇద్దరి హత్య!
మణుగూరు: అల్లపల్లి మండలం బుస్సాయిగూడెం గ్రామానికి చెందిన మడకం భీమయ్య మరియు మణుగూరు మండలం బూడుగుల గుత్తిగోయ గుంపునకు చెందిన పదం మాసయ్య అనే ఇద్దరు వ్యక్తులు గత నెల అనగా 07-10-2026 తేదీన ఒక ఇంటిలో పూజ నిర్వహించడానికి వెళ్లి, తిరిగి భూసురాయిగూడెం వైపు వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో వారిద్దరూ మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఐదుగురు వ్యక్తులు కలిసి వారిపై దాడి చేసి హత్య చేసి, అనంతరం మృతదేహాలను భూమిలో పాతిపెట్టినట్లు వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి మృతుడు మడకం భీమయ్య కుమార్తె ఎట్టి నందిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతోంది.




