Kothagudem: రవిచంద్ర హత్య కేసులో నిందితుడు ఇమ్రాన్ అరెస్ట్!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో రవిచంద్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. రూ.80 వేల అప్పు కోసం హత్య చేసిన నిందితుడు ఇమ్రాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Kothagudem: రవిచంద్ర హత్య కేసులో నిందితుడు ఇమ్రాన్ అరెస్ట్!
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం. కలువల నాగారం గ్రామానికి చెందిన బాధావత్ రవిచంద్ర హత్య కేసులో నిందితుడు మహమ్మద్ ఇమ్రాన్‌ను కరకగూడెం పోలీసులు అరెస్టు చేశారు. రూ.80 వేల అప్పు విషయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.
ఈ నెల 11న రాత్రి రవిచంద్రను మోటార్‌సైకిల్‌పై కలువల నాగారం గ్రామ శివారుకు తీసుకెళ్లిన ఇమ్రాన్.. బెల్టుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై మృతుడి తల్లి బాధావత్ విజయ ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఈ నెల 14న నిందితుడిని అతని ఇంటి వద్ద అరెస్టు చేసిన పోలీసులు.. హత్యకు ఉపయోగించిన మోటార్‌సైకిల్‌తో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.




