Julurupadu: అన్నదాతలను ముంచిన మురుసు తుఫాన్.. నేలకొరిగిన పంటలు!

Julurupadu: మురుసు తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, చండ్రుగొండ పరిధిలో భారీ వర్షాలకు వరి, పత్తి, మిరప పంటలు నీటమునిగి రైతులకు అపార నష్టం వాటిల్లింది.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 4 Nov 2026 5:34 PM IST
Julurupadu
X

Julurupadu: అన్నదాతలను ముంచిన మురుసు తుఫాన్.. నేలకొరిగిన పంటలు!

జూలూరుపాడు: తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో జూలూరుపాడు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాలలో రైతులు సాగుచేసిన వరి, మిర్చి, పత్తి పంటలు నేలకొరిగాయి.

వరి పంట కోత దశకు రాగా నేలరాలింది. అదేవిధంగా మిర్చి తోటలో కింద పడిపోయాయి, చేలలో ఉన్న పత్తి తడిసి ముద్దయి కారిపోయింది, కూరగాయల పంటలు వర్షార్పణమయ్యాయి, తుఫాను తమను నిండా ముంచిందని, పంటల చేతికి వచ్చే దశలో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎల్ ని నో ప్రభావంతో తీవ్ర వర్ష భావ పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడుతూ పంటలను కాపాడుకున్నప్పటికీ మురుసు తుఫాను తమకు తీరని శోఖాన్ని మిగిల్చిందని రైతుల వాపోతున్నారు.

ప్రభుత్వమే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అదేవిధంగా మూడు మండలాల్లో భారీ వర్షాలతో పలు గ్రామాల్లో మధ్య వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో ఆయా గ్రామాల మధ్య ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం అవస్థలకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు గ్రామాలు వాగులు వంకలు ప్రవహించిన నేపథ్యంలో ఇళ్లల్లోకి సైతం వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పలు పాఠశాలల్లోకి వరద నీరు చేరడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మురుసు తుఫాన్ తమను నిండా నిండా మంచిదని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU