Palvancha: దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: స్పెషల్ డీసీ!

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును గడువులోగా పరిష్కరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. వెంకటరావు అధికారులను ఆదేశించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 19 Oct 2026 8:23 PM IST
Palvancha
X

Palvancha: దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: స్పెషల్ డీసీ!

పాల్వంచ, అక్టోబర్ 19: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. వెంకటరావు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు.

సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి కె. శ్రీరామ్‌తో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాలు, ఉపాధి, పింఛన్లు, గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రతకు సంబంధించిన సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ప్రజావాణి మంచి వేదికగా నిలుస్తోందన్నారు. ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతతో పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, క్లిష్టమైన సమస్యలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.

వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచుకుని, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. ప్రజలు తమకు సమీపంలోని ఎంపీడీవో కార్యాలయంలోనూ వినతులు సమర్పించి స్థానిక స్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రయత్నించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తులతో పాటు సంబంధిత ఆధార పత్రాలను సమర్పించడం ద్వారా పరిష్కార ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN