Kothagudem: గోవిజ్ఞాన పరీక్షలు: గో సేవా తెలంగాణ ఆధ్వర్యంలో పోటీలు!

Kothagudem: రాష్ట్రవ్యాప్తంగా గోవిజ్ఞాన పరీక్షలు: నవంబర్ 4న జిల్లా, 15న రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకుల వెల్లడి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 9 Oct 2026 4:28 PM IST
Kothagudem
X

Kothagudem: గోవిజ్ఞాన పరీక్షలు: గో సేవా తెలంగాణ ఆధ్వర్యంలో పోటీలు!

Kothagudem: గోవు పర్యావరణ పరిరక్షణలో శాస్త్రీయ విజ్ఞానం ఉన్నది. కావున గో సేవ తెలంగాణ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గోవిజ్ఞాన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కో-కన్వీనర్ గుమలాపురం సత్యనారాయణ ప్రకటనలో తెలియజేశారు.

పరీక్షల వివరాలు:

- మొదట మండల స్థాయిలో, మండలం నుండి జిల్లా స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తారు.

- నగర స్థాయిలో, వారి వారి ప్రాంత పాఠశాల స్థాయిలో గెలుపొందిన వారికి జిల్లా స్థాయిలో నవంబర్ 4వ తేదీన పరీక్షలు నిర్వహిస్తారు.

- జిల్లాలో గెలుపొందిన వారికి నవంబర్ 15న భాగ్యనగర్ (హైదరాబాద్) లో రాష్ట్ర స్థాయి గోవిజ్ఞాన పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ విజ్ఞాన పరీక్షల యందు విద్యార్థినీ విద్యార్థులు మరియు పెద్దలు అందరూ పాల్గొనవచ్చును.

బహుమతులు:

ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు గవర్నర్ గారి చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారు.

- మొదటి బహుమతి: రూ.1,00,000

- రెండవ బహుమతి: రూ.50,000

- మూడవ బహుమతి: రూ.25,000

- ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయి.

కావున ఈ గోవిజ్ఞాన పరీక్షలను జయప్రదం చేయగలరని కన్వీనర్ కోరారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM