Kothagudem: బాణాసంచా విక్రయాలకు దరఖాస్తు చేసుకోండి: ఎస్పీ!

Kothagudem: దీపావళి బాణాసంచా దుకాణాల తాత్కాలిక లైసెన్సుల కోసం నవంబర్ 2 లోగా దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 27 Oct 2026 5:56 PM IST
Kothagudem
X

Kothagudem: బాణాసంచా విక్రయాలకు దరఖాస్తు చేసుకోండి: ఎస్పీ!

కొత్తగూడెం: రానున్న దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో తాత్కాలిక బాణాసంచా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనుమతులు కోరే వారు, అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన పూర్తి దరఖాస్తులను నవంబర్ 2వ తేదీలోపు సంబంధిత డీఎస్పీ కార్యాలయాల్లో సమర్పించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలిపారు.

దరఖాస్తుతో పాటు అగ్నిమాపక శాఖ జారీ చేసిన నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (NOC), స్థల యజమాని లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి నుంచి పొందిన అనుమతి పత్రం, జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, గతంలో లైసెన్స్ పొందినట్లయితే దాని ప్రతిని జతచేయాలని సూచించారు.

అవసరమైన చోట్ల పక్క స్థలాల యజమానుల అనుమతి పత్రాలు, విక్రయ కేంద్రానికి సంబంధించిన బ్లూప్రింట్ (సైట్ ప్లాన్)ను కూడా సమర్పించాలని తెలిపారు.అదేవిధంగా, ప్రభుత్వ ఖజానాకు నిర్ణీత రుసుము చెల్లించినట్లు ధ్రువీకరించే బ్యాంకు చలాన్‌ను దరఖాస్తుతో పాటు జతచేయాలని పేర్కొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM