Kothagudem: బూర్గంపాడు మండలంలో చేతబడి పేరుతో వృద్ధ మహిళకు హింస!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో చేతబడి పేరుతో వృద్ధ మహిళపై చిత్రహింసలు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.

G Ravi, Bhadradri
Published on: 21 Sept 2026 1:21 PM IST
Kothagudem
X

Kothagudem: బూర్గంపాడు మండలంలో చేతబడి పేరుతో వృద్ధ మహిళకు హింస!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో కలకలం రేపుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SK శకినాబి అనే వృద్ధ మహిళపై చేతబడి అనుమానంతో చిత్రహింసలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితురాలిని చెట్టుకు ఎక్కించి, మేకులు కొట్టినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఏం జరిగింది? వృద్ధ మహిళను ఎవరు, ఎందుకు ఇలా హింసించారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై పోలీసులు, సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధితురాలికి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.అయితే ఈ ఆరోపణలను అధికారికంగా పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri