Kothagudem: కాంగ్రెస్ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని రైటర్ బస్తీలో కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయ స్థలాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 29 Oct 2026 7:42 PM IST
Kothagudem
X

Kothagudem: కాంగ్రెస్ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి!

కొత్తగూడెం: పట్టణంలోని రైటర్ బస్తీలో కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం పరిశీలించారు. డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నతో కలిసి స్థలాన్ని సందర్శించి నిర్మాణ ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నూతన జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. నిర్ణీత సమయంలో నిర్మాణం పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాలరావు, ఆళ్ల మురళితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM