Cherla: చర్ల మండలం సత్యనారాయణపురంలో ఇసుక లారీ ఢీకొని ఒకరి మృతి!

Cherla: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఎల్లమెల్లి భీమరాజు మృతి చెందారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 26 Nov 2026 10:20 AM IST
Cherla
X

Cherla: చర్ల మండలం సత్యనారాయణపురంలో ఇసుక లారీ ఢీకొని ఒకరి మృతి!

భద్రాచలం నవంబర్ 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్యనారాయణపురం ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఎల్లమెల్లి భీమరాజును వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. తీవ్ర గాయాలపాలైన భీమరాజును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఎల్లమెల్లి భీమరాజు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆయనను చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ డాక్టర్ సాయి వర్ధన్ ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే, భద్రాచలం తరలిస్తుండగా మార్గమధ్యలోనే భీమరాజు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో సత్యనారాయణపురం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

చర్ల మండల నుంచి భద్రాచలం వెళ్లాలంటే ప్రజలు ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. లారీలు వరుసగా రావడంతో వాహనాలను పక్కనపెట్టి పది నుంచి 20 నిమిషాల వరకు ఎదురు చూసి ప్రయాణిస్తున్నారు.. లారీలు మాత్రం ఒకటి వెనుక ఒకటి అతివేగంగా నడుస్తున్నాయి.. లారీలు ఎంత స్పీడ్ గా వెళ్తున్నాగాని పట్టించుకునే అధికారులే కరువయ్యారని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు ఇసుక లారీలు ఢీకొట్టడంతో చాలామంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి గొడవలు రాస్తా రోకోలు చేసిన అవి కేలం అప్పటికి మాత్రమే.. రాపులు ఆపేస్తాం అంటారు కానీ మళ్లీ యధావిధిగా కొనసాగుతూనే ఉంటున్నాయి. ఇంకెంత మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి అనే భయభ్రాంతులతో ప్రజలు ఉన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem