Kothagudem: మొరంపల్లి సంతకు గండి రూ.35 లక్షల పాటదారుడికి తీరని నష్టం
Kothagudem: మొరంపల్లి బంజారా సంత పేరుతో ముసలిమడుగు వ్యక్తి అక్రమ వ్యాపారం. రూ. 35 లక్షల సంత పాటదారుడికి, పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారంటూ స్థానికుల ఆగ్రహం.
Kothagudem: మొరంపల్లి సంతకు గండి రూ.35 లక్షల పాటదారుడికి తీరని నష్టం
కొత్తగూడెం: మొరంపల్లి బంజారా సంత పరిధిలో ముసలిమడుగు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇతర ప్రాంతాలకు ఆవులను తరలిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రూ.35 లక్షలు వెచ్చించి సంత పాట దక్కించుకున్న పాటదారుడికి తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తమవుతోంది.
సంత పరిధిలో జరగాల్సిన వ్యాపారాలు ఇతర ప్రాంతాలకు తరలిపోతుంటే పంచాయతీ ఆదాయానికి గండి పడుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
*సంత ఒకచోట.. వ్యాపారాలు మరోచోట అంటే పంచాయతీ నిబంధనలకు విలువ ఎక్కడ?* సదరు వ్యక్తి వ్యవహారంపై విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి, సంత పాటదారుడికి, గ్రామ పంచాయతీకి నష్టం కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




