Bhadrachalam: భద్రాచలంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడి పర్యటన!

Bhadrachalam: భద్రాచలం ఎంపీపీ స్కూల్‌లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధ వెంకట సూర్య ప్రకాశరావు సరస్వతీ దేవి విగ్రహాన్ని ఆవిష్కరించి విద్యా సామగ్రి అందజేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 3 Nov 2026 4:22 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడి పర్యటన!

భద్రాచలం నవంబర్ 3: వాసవి క్లబ్ భద్రాచల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవి విగ్రహావిష్కరణను అంతర్జాతీయ అధ్యక్షులు ముఖ్య అతిథి వాసవియన్. సౌభాగ్య సేవ సంకల్ప KCGF సిద్ధ వెంకట సూర్య ప్రకాశరావు గారిచే ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం అధ్యక్షులు వనామ కిరణ్ కుమార్ గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా అంతర్జాతీయ వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారు, జిల్లా గవర్నర్ చారుగుళ్ల శ్రీనివాస్ హాజరయ్యారు.

ఈ ఈ సందర్భంగా అంతర్జాతీయ దశలో సిద్ధ వెంకట సూర్య ప్రకాష్ రావు గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవి విగ్రహావిష్కరణ చేయడం శుభ సూచకమని విద్యార్థులు నిత్యం అమ్మవారి ఆశీస్సులు పొంది చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి ఇటు సమాజానికి దేశానికి సేవ చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. అనంతరం, స్కూల్ లో పిల్లలకు జామెట్రికల్ సామాగ్రి, , పెన్నులు బిస్కెట్ ని చాక్లెట్లు , మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్న అయాలకు చీరలను అందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆంజనేయ స్వామి పార్కులో సందర్శుకుల కొరకు రెండు సిమెంట్ బల్లలను వితరణగా అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్యాబినెట్ ప్రధాన కార్యదర్శి అడ్మినిస్ట్రేషన్ రుద్ర వినోద్ కుమార్ , క్యాబినెట్ ప్రధాన కార్యదర్శి రేపాక ధనుంజయ రాజ మనోహర్, జిల్లా క్యాబినెట్ కోశాధికారి ఉడతా నగేష్ కుమార్, క్లబ్ ప్రధాన కార్యదర్శి పెనుగొండ సంతోష్, కోశాధికారి నాలా సాయిచంద్, రీజియన్ చైర్పర్సన్ బండారు కృష్ణయ్య జోన్ చైర్మన్ బచ్చు సాగర్, లొకేషన్ నాకు పంపిస్తే క్లబ్ సీనియర్ సభ్యులు గుడుమాసు వెంకట సత్యనారాయణ, పాఠశాల హెడ్మాస్టర్ కారం పాపయ్య, బోధన సిబ్బంది, బోధ నేతల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem