Bhadrachalam: పంచారామ క్షేత్రాలకు భద్రాచలం నుండి ప్రత్యేక బస్సులు

Bhadrachalam: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అమరావతి, భీమవరం, ద్రాక్షారామం తదితర పంచారామ క్షేత్రాలకు సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులను నడుపుతున్న భద్రాచలం ఆర్టీసీ డిపో.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 12 Nov 2026 7:30 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: పంచారామ క్షేత్రాలకు భద్రాచలం నుండి ప్రత్యేక బస్సులు

భద్రాచలం: భద్రాచలం ఆర్ టి సి డిపో నుండి ప్రతి సంవత్సరం మాదిరి గానే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రాలైన అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోట పంచారామ దర్శనం కోసం కొత్త సూపర్ లగ్జరీ బస్సు లను నడుపుతోంది.ఇట్టి బస్సు ఆదివారం రాత్రి 20.00 గంటలకు బయలుదేరి కార్తీక సోమవారం రోజున అయిదు పుణ్యక్షేత్రాలను దర్శింప చేసి మంగళవారం ఉదయం 4.00 గంటలకు భద్రాచలం చేరును.

టికెట్ వెల పెద్దలకు 2150/- రూపాయలు పిల్లలకు 1100/- రూపాయలు, అలాగే అన్నవరం వెళ్ళు భక్తులకు కూడా ప్రతీ ఆదివారం రాత్రి 21.00 గంటలకు బస్సు బయలుదేరును. అన్నవరం నాకు ఛార్జ్ ఒకవైపు 500/- రూపాయలు మాత్రమే. అలాగే శబరిమల యాత్రకు వెళ్ళు అయ్యప్ప స్వాముల కొరకు కొత్త సూపర్ లగ్జరీ బస్సు లను అద్దెకివ్వబడును. ఇట్టి శబరిమల యాత్రకు వెళ్ళు బస్సు లో గురుస్వామి కి ఉచిత ప్రయాణం కలదు.

మరియు ఇద్దరు మణికంఠ లకు, ఇద్దరు వంట వారికి సామానులను చూసుకొనుటకు ఒక మనిషికి సీట్ లేకుండా ఉచిత ప్రయాణం ఇవ్వబడును. 40 మంది ప్రయాణికులు బ్యాచ్ గా ఉంటే విజ్ఞాన విహార యాత్రలకు మీరు కోరిన చోటికి బస్సు లు ఇవ్వబడును.ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరు ఉపయోగించుకోగలరు భద్రాచలం ఆర్టీసీ డిపో అధికారులు కోరుతున్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem