Bhadrachalam: రూ.10,116 లకు గణపయ్య లడ్డూను దక్కించుకున్న టౌన్ సీఐ!

Bhadrachalam: భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనం. డప్పుల మోతకు స్టెప్పులేసిన సీఐ నాగరాజు.. రూ.10,116 లకు గణనాథుడి లడ్డూ ప్రసాదం కైవసం.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 19 Sept 2026 11:00 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: రూ.10,116 లకు గణపయ్య లడ్డూను దక్కించుకున్న టౌన్ సీఐ!

భద్రాచలం సెప్టెంబర్ 19: వినాయక చవితి పండుగ సందర్భంగా భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో ఐదు రోజులపాటు నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఐదు రోజులపాటు గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈరోజు భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివ నాయక్ గారు, డీఎస్పీ అరుణ్ కుమార్ ఈరోజు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. నేటితో ఈ ఉత్సవాలు ముగియడంతో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను చేశారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారి లడ్డుని (అమృత ఫలం) పాటలో పట్టణ సీఐ నాగరాజ్ 10,116/- రూ లకు దక్కించుకున్నారు.

విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడితో ఉండే పోలీస్ అన్న ఒక్కసారిగా చిన్నపిల్లల మారి చిందులు వేశారు. డప్పుల మోతలతో గణనాధుని ఘనంగా గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సీఐ నాగరాజు, ఎస్సైలు సతీష్, రామకృష్ణ, జి స్వప్న, చారి రాంబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem