Bhadrachalam: భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ దాడులు: 11 లైసెన్సులు రద్దు!
Bhadrachalam: భద్రాచలంలో టీజీ సేఫ్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి 11 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్ చేశారు. 565 కిలోల నాసిరకం పదార్థాలను సీజ్ చేశారు.
Bhadrachalam: భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ దాడులు: 11 లైసెన్సులు రద్దు!
భద్రాచలం నవంబర్ 06: భద్రాచలంలో ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో TG SAFE ఆధ్వర్యంలో ఆహార భద్రతా శాఖ అధికారులు వివిధ హోటళ్లు, రెస్టారెంట్లపై మెరుపు దాడులు (రైడ్స్) నిర్వహించారు. ఈ దాడుల్లో ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని మొత్తం 11 రెస్టారెంట్ల లైసెన్సులను సస్పెండ్ చేయగా మరో 4 రెస్టారెంట్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు.
అదేవిధంగా, వినియోగానికి అనర్హమైన మరియు నాణ్యత ప్రమాణాలు లేని మొత్తం 565 కిలోల ముడి ఆహార పదార్థాలను గుర్తించి తొలగించారు. ఆహార వ్యాపార సంస్థలు తప్పనిసరిగా పరిశుభ్రత, నాణ్యత మరియు ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని అధికారులు సూచించారు. లోపాలను సరిదిద్దుకుని, తిరిగి తనిఖీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించిన తర్వాతే లైసెన్సులు పునరుద్ధరించబడతాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




