Bhadrachalam: ప్రతిభావంతులైన విద్యార్థినులకు సబ్ కలెక్టర్ ప్రశంసలు!

Bhadrachalam: భద్రాచలం ఎంజేపీటీబీసీడబ్ల్యూ కళాశాలలో ప్రతిభ చూపిన విద్యార్థినులకు సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ప్రశంసా పత్రాలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 26 Oct 2026 4:33 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: ప్రతిభావంతులైన విద్యార్థినులకు సబ్ కలెక్టర్ ప్రశంసలు!

భద్రాచలం అక్టోబర్ 26: భద్రాచలం లోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలికల) కు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థినులను వారి విద్యా నైపుణ్యానికి అభినందించి ప్రశంసా పత్రాలను అందజేసి సత్కరించడం జరిగిందని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ అన్నారు.

ఈరోజు తన చాంబర్లో మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికలు విద్యా నైపుణ్యాలు పెంపొందించుకొని మంచిర్యాంకులు సాధించిన, విద్యార్థినిలు పి. ప్రవల్లిక - 1వ ఎంపీసీ, కె. రేవతి - 1వ బీఐపీసీ, ఎం. నందిని - 1వ సీఈసీ లను ప్రత్యేకంగా అభినందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యాభ్యాసంలో ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థినిలకు, స్కాలర్‌షిప్ అవకాశాలను అన్వేషించి దరఖాస్తు చేసుకోవడంలో విద్యార్థులకు సహాయపడాలని ఆయన ప్రిన్సిపాల్ కు సూచించారు.

విద్య నైపుణ్యాలలో ప్రతిభ చూపి అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని ఆయన విద్యార్థినిలకు సూచించారు. గతంలో ఐటీసీ భాగస్వామ్యంతో కళాశాలలో నీట్ జేఈఈ కోసం ఒక కంప్యూటర్ ల్యాబ్ మరియు ఒక మినీ లైబ్రరీని గతంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem