Pinapaka: భూ రీ-సర్వే పనులను పరిశీలించిన భద్రాచలం సబ్ కలెక్టర్

Pinapaka: పినపాక నియోజకవర్గంలో భూ రీ-సర్వే పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట. నెలన్నరలోగా సర్వే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 22 Sept 2026 7:00 PM IST
Pinapaka
X

Pinapaka: భూ రీ-సర్వే పనులను పరిశీలించిన భద్రాచలం సబ్ కలెక్టర్

పినపాక: పినపాక నియోజకవర్గం లోని బూర్గంపాడు పినపాక పట్టి నగర్, అశ్వాపురం కొమ్ముగూడెం గ్రామం, పినపాక మండలం సున్నం వారి గూడెం, మరియు కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామం రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల శ్రేష్టమంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పినపాక పట్టి నగర్, కొమ్ముగూడెం, సున్నం వారి గూడెం, బట్టుపల్లి గ్రామాలలో జరుగుతున్న సర్వే పనులను పరిశీలించి, సర్వే పురోగతి, భూ హద్దుల నిర్ధారణ, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు ఇస్తూ రెవెన్యూ అసైన్‌మెంట్, అటవీ భూములు కలిసి ఉన్నందున ఆయా భూముల హద్దులను రికార్డుల ఆధారంగా స్పష్టంగా నిర్ధారించాలని సూచించారు. అటవీ భూముల హద్దులు ఇప్పటికే నిర్ధారితంగా ఉన్న ప్రాంతాల్లో అనవసర జాప్యం లేకుండా మిగిలిన రీ-సర్వే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

రీ-సర్వే పనులను ప్రణాళికాబద్ధంగా, వేగవంతంగా చేపట్టి నెలన్నరలోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ భూ హద్దులను స్పష్టంగా నిర్ధారించి, భూ రికార్డుల్లో ఎలాంటి అయోమయానికి తావులేకుండా సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం గ్రామస్తులు మరియు రైతులతో మాట్లాడి రీ సర్వే పనులకు సంబంధించి ఏమైనా సమస్యలను ఎదుర్కొన్నట్లయితే వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ సర్వే పనులు నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలని అన్నారు.

అనంతరం మణుగూరు లోని తాసిల్దార్ కార్యాలయంలో సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించి వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సిబ్బంది వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు.

ముఖ్యంగా నియమ నిబంధనల ప్రకారం మీసేవ ధ్రువీకరణ పత్రాలు జారీ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళల సమస్యలను అత్యంత ప్రాధాన్యత పరిశీలించి వెంటనే వారి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

వర్షాకాలం నడుస్తున్నందున కార్యాలయం ప్రాంగణంలో చెత్తాచెదారం పిచ్చి మొక్కలు పేరుకుపోకుండా శుభ్రంగా ఉంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ సిబ్బంది సక్రమంగా తమ విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తాసిల్దారులు, లైసెన్సుడ్ సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, అటవీశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA