Bhadrachalam: ఆర్టీసీ కండక్టర్ ప్రవల్లిక చికిత్స పొందుతూ మృతి భద్రాచలంలో నిరసనలు!
Bhadrachalam: ప్రయాణికురాలు నెట్టివేయడంతో గాయపడిన ఆర్టీసీ కండక్టర్ ప్రవల్లిక మృతి. భద్రాచలం డిపో ఎదుట కార్మికుల బైఠాయింపు, నిరసనలతో స్తంభించిన బస్సులు.
Bhadrachalam: ఆర్టీసీ కండక్టర్ ప్రవల్లిక చికిత్స పొందుతూ మృతి భద్రాచలంలో నిరసనలు!
Bhadrachalam: భద్రాచలం గత నెల 25వ తేదీన మిట్టగూడెం స్టేజీ వద్ద చోటుచేసుకున్న ఘటనలో బస్సు కండక్టర్ ప్రవల్లిక తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికురాలు నెట్టివేయడంతో బస్సు టైర్ల కింద పడిన ప్రవల్లికకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లోని ఆసుపత్రిలో పది రోజుల పాటు చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు.
ప్రవల్లిక మృతికి సంతాపంగా ఖమ్మం రీజియన్ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నివాళులర్పించారు. విధులకు హాజరుకాకుండా భద్రాచలం డిపో ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రవల్లిక మృతికి కారణమైన ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. భద్రాచలంలోని తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ కార్మికులు చేపడుతున్నటువంటి బంధు కారణంగా బస్సులు లేకపోవడంతో భద్రాచలం వచ్చిన భక్తులు నానా అవస్థలు పడుతున్నారు.




