Bhadrachalam: క్రైస్తవ సమాజ సమస్యలపై పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం!
Bhadrachalam: భద్రాచలం దుమ్ముగూడెం మండలం మారాయిగూడెంలో పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొని క్రైస్తవ సమాజ సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు.
Bhadrachalam: క్రైస్తవ సమాజ సమస్యలపై పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం!
Bhadrachalam: దుమ్ముగూడెం మండలం, మారాయిగూడెం గ్రామంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డా. తెల్లం వెంకట్రావు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవ పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు ఎమ్మెల్యే గారికి ఘనంగా, ఆత్మీయంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా క్రైస్తవ సమాజానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై పాస్టర్లతో ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు గారు ఆత్మీయంగా చర్చించారు. ముఖ్యంగా ప్రార్థనా మందిరాలకు సంబంధించిన సమస్యలు, క్రైస్తవ సమాజ సంక్షేమం, పాస్టర్ల సమస్యలు, విద్యా వైద్య సదుపాయాలు మౌలిక వసతులు, పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలు వంటి అంశాలపై చర్చ జరిగింది.
అలాగే ప్రజలందరికీ సమానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే గారు తెలిపారు. క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు, పాస్టర్లు మరియు క్రైస్తవ సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.




