Bhadrachalam: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే!
Bhadrachalam: భద్రాచలం గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు.
Bhadrachalam: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే!
భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ‘ప్రతి ఇంటికి ఒక భరోసా’ అనే నినాదంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు ప్రారంభించారు.
కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ఆపద సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా జీవిత బీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలనే గొప్ప లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి భద్రత, భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ గారు, డీఆర్‌డీఏ విద్యాచందన గారు, జెడ్పీ సీఈవో నాగలక్ష్మి గారు, డీపీవో బొప్పన అనూష గారు, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్ గారు, వార్డు సభ్యులు బొంబోతుల రాజీవ్, బొంత రమణ, బండారు శరత్‌బాబు, అబ్బినేని వినీలారాణి, కావూరి గోపి, నర్రా వాణి, నిట్ట రాజు, కారం దుర్గారావు, ఇలమల అశోక్, సున్నం భూలక్ష్మి, సున్నం ఈశ్వరమ్మ, జగ్గా కుమారి, ఇర్పా అనసూయ తదితరులు పాల్గొన్నారు.




