Bhadrachalam: నిమ్స్ బాధితురాలికి రూ.5 లక్షల LOC: సీఎంకు ఎమ్మెల్యే లేఖ!
Bhadrachalam: నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వీఆర్‌పురం మహిళ వైద్యం కోసం సీఎం సహాయ నిధి ద్వారా రూ.5 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం లేఖ రాశారు.
Bhadrachalam: నిమ్స్ బాధితురాలికి రూ.5 లక్షల LOC: సీఎంకు ఎమ్మెల్యే లేఖ!
భద్రాచలం నవంబర్ 11: వెంకటాపురం మండలం, వీఆర్ పురం గ్రామానికి చెందిన బద్ది సడాలమ్మ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు.
మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బద్ది సడాలమ్మకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అవసరమని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలి వైద్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) రూపంలో రూ.5,00,000 ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.
అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, మెరుగైన వైద్యం అందించేందుకు తన వంతు సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి చొరవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




