Bhadrachalam: రేగుబల్లిలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
Bhadrachalam: దుమ్ముగూడెం మండలం రేగుబల్లిలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
Bhadrachalam: రేగుబల్లిలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
భద్రాచలం: దుమ్ముగూడెం మండలం, రేగుబల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రేగుపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన్ నిర్మాణానికి భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టి భవన నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు మాట్లాడుతూ, మహిళా సమైక్య భవన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత నాయకులకు సూచించారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు, అభిమానులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




