Bhadrachalam: రేపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన

Bhadrachalam: భద్రాచలంలో రేపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. సీతారామచంద్రస్వామి దర్శనం, గణేష్ మండపాల పూజలు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 22 Sept 2026 7:49 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: రేపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన

భద్రాచలం: బుధవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలం పర్యటన సందర్భంగా ఉదయం ఏడు గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి టెంపుల్ ను దర్శించుకుని అనంతరం పుష్కరాలు సందర్భంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి

అనంతరం ఎనిమిది గంటలకు సర్పంచ్ పూనం కృష్ణ గారి ఇంటి వద్ద అల్పాహార విందు అనంతరం కాలేజీ గ్రౌండ్ లో వినాయకుడి మండపం వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి ముదిరాజ్ బజార్లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఆ తర్వాత భద్రాద్రి కా మహారాజ్ గణేష్ మండపం వద్ద పూజా కార్యక్రమం మంత్రి పొంగులేటి పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమాల్లో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొంటారు ఉదయం ఏడు గంటలకు అయ్యప్ప స్వామి టెంపుల్ వద్దకు రాగలరు కావున నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు నామినేటెడ్ మరియు ఇన్చార్జిలు సమయం పాటించి సకాలంలో రాగలరని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రత్నం రమాకాంత్ కోరారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem