Bhadrachalam: భద్రాచలం కాలేజీ గ్రౌండ్‌లో రేపు కోటి దీపోత్సవం

Bhadrachalam: మహా శ్రీ చక్రపీఠం ఆధ్వర్యంలో నవంబర్ 26న భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కోటి దీపోత్సవం; ఉచితంగా 365 ఒత్తులు, ప్రమిదలు అందజేత.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 25 Nov 2026 4:42 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలం కాలేజీ గ్రౌండ్‌లో రేపు కోటి దీపోత్సవం

భద్రాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల దివ్య క్షేత్రంలో, కార్తీక మాసాన్ని పురస్కరించుకొని, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బ్రహ్మశ్రీ డా. సత్తెనపల్లి ఉమామహేశ్వర ఆచార్య, పీఠాధిపతి తెలిపారు. భారతదేశంలోనే రెండవ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

కార్తీకమాసం 26 గురువారం రోజున ఆ పరమ శివుడికి ఇష్టమైనటువంటిది ఆరుద్ర నక్షత్రం ఉన్నది కావున తప్పనిసరి సరిగా ఆరుద్ర నక్షత్ర సమయంలో ఆ పరమేశ్వరుడికి ప్రీతి కరమైన సమయం అని ఎవరైతే ఈ కోటి దీపోత్సవం లో పాల్గొని దీపారాధన కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుడిని మనస్పూర్తిగా దీపాలను వెలిగించి ఆశీర్వచనాలు పొంది, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందగలరని ఉన్నత చదువులు బంగారు భవిష్యత్తు కోరిన కోరికలన్నీ దీపం తల్లి తీరుస్తుందని బ్రహ్మశ్రీ డాక్టర్ సత్తనపల్లి ఉమామహేశ్వర ఆచార్య పారం పర్య మహా శ్రీచక్ర పిటాది పతి తెలిపారు.

భద్రాచలంలో చేపట్టబోయే ఈ మహోత్తర కార్యక్రమం భద్రాచల పట్టణవాసులు ఈ యొక్క కార్యక్రమానికి సహాయకులు మీసాల రామకృష్ణ, పి సత్యనారాయణ రెడ్డిలో ఆధ్వర్యంలో నిర్వహించబడును. రేపు జరగబోయే దీపోత్సవానికి 365 ఒత్తులు, ప్రమిదలు నూనె ఒక అగ్గిపెట్ట ఉచితంగా ఉచితంగా ఇవ్వబడుతుందని తెలిపారు.

అంతేకాకుండా ఇదే కార్యక్రమంలో లక్షద్వీపం కావాలంటే రూ.250 తో లక్ష దీపం వత్తులు తీసుకున్న వారికి మూడు అడుగుల పంచ లోహ శివలింగానికి స్వయంగా అభిషేకం చేసే అవకాశం ఉంటుందని, అది కూడా కేవలం 108 మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుందని ఈ కమిటీ వారు తెలిపారు. లక్ష దీపాలు కొనుగోలు చేసుకునేవారు ఈ నెంబర్ను సంప్రదించగలరని 839503839కు సంప్రదించగలరని వారు కోరారు. సుమారు 3000 మందితో ఈ మహోత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem