Bhadrachalam: భద్రాచలంలో కార్తీక మాస శోభ.. గోదావరిలో భక్తుల పవిత్ర స్నానాలు!

Bhadrachalam: కార్తీక మాసం ప్రారంభం కావడంతో భద్రాచలం గోదావరి తీరంలో భక్తుల రద్దీ. పవిత్ర స్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలిన భక్తులు. శివాలయంలో ప్రత్యేక పూజలు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 10 Nov 2026 10:57 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో కార్తీక మాస శోభ.. గోదావరిలో భక్తుల పవిత్ర స్నానాలు!

Bhadrachalam: భద్రాచలం నవంబర్ 10 - కార్తీక మాసం ప్రారంభం కావడంతో భద్రాచలంలోని పుణ్య గోదావరి నది భక్తులతో సందడిగా మారింది. కార్తీక మాసం తొలి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ, నదిలో దీపాలు వదులుతూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానము ఉపాలయమైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం (శివాలయం)లో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భద్రాచలంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పుణ్య గోదావరి నదిలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. స్నానానంతరం గోదావరి తీరంలో దీపాలు వెలిగించి, నదిలో దీపాలను వదులుతూ కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉండటంతో భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఉపాలయమైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం (శివాలయం)లోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కార్తీక మాసం తొలి రోజే గోదావరి తీరం, శివాలయం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem