Bhadrachalam: భద్రాద్రి, హరిహర క్షేత్రంలో పోటెత్తిన అయ్యప్ప భక్తులు!

Bhadrachalam: కార్తీక మాసం ప్రారంభంతో భద్రాచలం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల కిటకిట. 2 వేల మంది భక్తులు మాలధారణ, 3 వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 11 Nov 2026 11:18 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాద్రి, హరిహర క్షేత్రంలో పోటెత్తిన అయ్యప్ప భక్తులు!

Bhadrachalam: భద్రాచలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల దివ్య క్షేత్రంలో కార్తీక మాసం ప్రారంభం కావడంతో భద్రాద్రి హరిహర క్షేత్రం శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిలాడింది ఈరోజు తెల్లవారుజామున 2000 మంది వరకు భక్తులు అయ్యప్ప దీక్ష చేపట్టారు. తెల్లవారుజామున పావన గోదావరి నదిలో పుణ్య స్థానం ఆచరించి శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి చేరుకొని అయ్యప్ప స్వామి మాల దీక్ష చేపట్టారు. ఒక్కసారిగా అయ్యప్ప దీక్షాపరులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దేవాలయం మొత్తం కిటకిటలాడింది.

భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీ అయ్యప్ప స్వామి కమిటీ వారు సకల ఏర్పాట్లను చేశారు. ఈరోజు బుధవారం కావడంతో సుమారు 3000 మందికి పైగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భద్రాచల శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప దీక్ష పరులు నిత్యం ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించేందుకు దేశ నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకుంటారు అందులో అయ్యప్ప దీక్ష పరులు మాత్రం ఈ యొక్క భద్రాద్రి హరిహర క్షేత్రానికి వచ్చి సన్నిధికి వచ్చి శరణు ఘోష చేసి వెళ్తుంటార.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem