Bhadrachalam: భద్రాచలంలో అష్టముఖ గండభేరుండ నరసింహ హోమం!

Bhadrachalam: భద్రాచలం కల్పవృక్ష నరసింహ స్వామి ఆలయంలో ధన్వంతరి త్రయోదశి సందర్భంగా అష్టముఖ గండభేరుండ నరసింహ హోమం నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి ముడుపులు కట్టారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 7 Nov 2026 4:21 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో అష్టముఖ గండభేరుండ నరసింహ హోమం!

భద్రాచలం నవంబర్ 07: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం దివ్య క్షేత్రంలో శ్రీ కల్పవృక్ష నరసింహ స్వామి వారి దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ధన్వంతరి త్రయోదశి సందర్భముగా అష్టముఖ గండబేరుండ నరసింహ హోమం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి తమ కోరికలు నెరవేరేందుకు ఈ కల్పవృక్ష నరసింహ స్వామి దేవాలయంలో ముడుపులు కడుతున్నారు.

ఈరోజు తెల్లవారుజాము నుంచి కల్పవృక్ష ఆలయం చుట్టూ గిరి ప్రదర్శన చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ముడుపులు కట్టారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడి కమిటీ వారు ఏర్పాటు చేశారు వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నట్లు కమిటీ వారు తెలిపారు ఈరోజు పాల్గొనట్లు తెలిపారు. ఎవరైతే ముడుపులు కడతారో వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని శ్రీమాన్ డాక్టర్ కృష్ణ చైతన్య స్వామివారు తెలిపారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem