Bhadrachalam: గిరిజన విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు త్వరగా పూర్తి చేయాలి

Bhadrachalam: భద్రాచలంలో ఏటీడీవోలు, హెచ్‌ఎంలతో ఐటీడీఏ పీవో బి.రాహుల్ సమీక్ష. గిరిజన విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, యూనిఫారాలు, 10వ తరగతి ఫలితాలపై ప్రత్యేక ఆదేశాలు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 10 Nov 2026 5:18 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: గిరిజన విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు త్వరగా పూర్తి చేయాలి

భద్రాచలం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థుల పోస్ట్ మెట్రి ,ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లతోపాటు ప్రతి విద్యార్థిని విద్యార్థులకు నాలుగు జతల యూనిఫామ్ తో పాటు పాఠశాలలకు సంబంధించిన అన్ని రకాల బిల్లులు పెండింగ్ లేకుండా నవంబర్ 20 నాటికి పూర్తిస్థాయిలో అప్డేట్ అయ్యేలా ప్రత్యేక బాధ్యత తీసుకొని, ఇప్పటినుండే పదవ తరగతిలో వెనుకబడ్డ సబ్జెక్ట్ పిల్లలపై సంబంధిత హెచ్ఎం, వార్డెన్ లు ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యం వహించే హెచ్ఎం, వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు.

ఈరోజు ఐటీడీఏ సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏటీడీవోలు, హెచ్ఎం, వార్డెన్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పాఠశాలల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సూచనల మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులకు సంబంధించిన ఎటువంటి అంశాలు పెండింగ్లో ఉండకుండా చూడాలని అన్నారు.

ముఖ్యంగా పాఠశాలలకు సంబంధించిన బిల్స్ మరియు కాస్మోటిక్, డైట్ చార్జెస్ బిల్లులు, యూనిఫామ్స్ సరఫరా ఏదైనా పాఠశాలల్లో పెండింగ్లో ఉంటే నవంబర్ 14 తేదీ వరకు క్లియర్ చేయాలని, అశ్రద్ధ వహించే హెచ్ఎం వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

విద్యార్థినీ విద్యార్థులకు అందవలసిన కాస్మోటిక్ చార్జెస్ సకాలంలో వారి బ్యాంకు అకౌంట్లో జమ అయ్యేలా చూడాలని, ఎవరైనా పిల్లలు బ్యాంకు ఎకౌంటు తీయకపోతే వారి పేరెంట్స్ ను పిలిపించి ఈపాస్ యాప్ ద్వారా బ్యాంకు ఎకౌంటు ఓపెన్ చేయాలని, ఈ ప్రక్రియ నవంబర్ 20 వ తారీకు వరకు 100% పూర్తి కావాలని అన్నారు.

అలాగే పాఠశాలలకు సంబంధించిన ఇండెంట్ ప్రతినెల 5వ తేదీ వరకు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి పంపించాలని అన్నారు.వైట్ షూస్, టై బెల్టులు కొన్ని పాఠశాలల్లో ఎక్స్ట్రా సరఫరా అయినట్టు నా దృష్టికి వచ్చిందని, అవసరమైనంత మేర పిల్లలకు సరఫరా చేసి మిగతా వాటిని ఏటిడిఓ అప్పగించి తక్కువ పడ్డ పాఠశాలలకు సరఫరా చేయాలని హెచ్ఎం లకు సూచించారు.

పాఠశాలలకు సరఫరా అయ్యే నిత్యావసర సరుకులు నాణ్యతగా ఉన్న వాటినే తీసుకోవాలని, నాసిరకంగా ఉన్న వాటిని వాపస్ చేసి డిడి ట్రైబల్ వెల్ఫేర్ దృష్టికి తీసుకొని రావాలని అన్నారు.ప్రతి ఇన్స్టిట్యూషన్లో చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు యూనిఫామ్ పూర్తిస్థాయిలో అందేలా చూడాలని, ఏదైనా పాఠశాలల్లో యూనిఫామ్ సరఫరా విషయంలో జాప్యం జరిగినట్టు తన దృష్టికి వస్తే సంబంధిత హెచ్ఎం లకు ఉపేక్షించేది లేదని, టైలర్ల వెంటపడి త్వరగా కుట్టించి పిల్లలకు యూనిఫామ్ అందించి దానికి సంబంధించిన ఫోటోలు ఏటీడీవోకు పంపించాలని అన్నారు.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి గిరిజన సంక్షేమ శాఖ ఇన్స్టిట్యూషన్ లకు నిధులు విడుదల చేస్తున్నందున పోస్ట్ మెట్రిక్, ఫ్రీ మెట్రి స్కాలర్షిప్స్ విషయంలో పిల్లల బ్యాంక్ అకౌంటులు తీయించి ఈపాస్ లో ఈనెల 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసి పూర్తి చేయాలని, కులం సర్టిఫికెట్ల విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని ఇప్పటికే సంబంధిత తాసిల్దారులకు సర్కులర్ జారీ చేయడం జరిగిందని ఆయన అన్నారు.

పి ఎం హెచ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల స్కాలర్షిప్లు వివిధ కారణాలతో దాదాపు 4,800 వందల వరకు పెండింగ్లో ఉన్నాయని, సంబంధిత వార్డెన్ లు ఆయా కళాశాలకు వెళ్లి పూర్తిస్థాయిలో పరిశీలించి డీఎస్సీ పెట్టించి పిల్లలకు స్కాలర్షిప్ వచ్చేలా చూడాలని, దానికి సంబంధించిన ప్రక్రియ ఒక వారం రోజుల్లో పూర్తి కావాలని, సంబంధించిన ఫోటోలు డిడి ట్రైబల్ వెల్ఫేర్ వరకు పంపించాలని అన్నారు

పదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థులకు పిల్లలు ఏ సబ్జెక్టులైతే వెనుకబడి ఉన్నారో ముఖ్యంగా తెలుగు, గణితం, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు పిల్లలకు తప్పనిసరిగా ఎక్స్ట్రా పీరియడ్లు తీసుకొని విద్యా బోధన చేయాలని అలాగే ఉద్దీపకం వర్క్ బుక్ -3 నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని అలాగే వారధి పుస్తకంలోని కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన అంశాలు తప్పనిసరిగా ప్రతిరోజు రెండు పీరియడ్ లు పిల్లలకు బోధించాలని, సంబంధిత హెచ్ఎం లు వారి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని జిపిఎస్ పాఠశాలలను తప్పనిసరిగా పర్యవేక్షించాలని, సంబంధిత డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని, ఏటీడీవోలు తప్పనిసరిగా వారధి పుస్తకంలోని అంశాలు పిల్లలకు తెలియజేస్తున్నది లేనిది పర్యవేక్షించి దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకోవాలని అన్నారు.

అనుకోకుండా గోదావరి వరదలు సంభవించినప్పుడు ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తుందని కానీ ఇంటి నుంచి వెళ్లి చదువుకునే పిల్లలకు మాత్రమే సెలవులు జడ్పీ పాఠశాల పిల్లలకు వర్తిస్తాయని, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో వసతిగృహాలల్లో చదివే పిల్లలకు కాదని, పిల్లలు పాఠశాలలో ఉంటున్నందున ఆరోజు సంబంధిత హెచ్ఎం వార్డెన్ లు ముగ్గురు టీచర్లకు విధులు నిర్వహించడానికి డ్యూటీలు కేటాయించాలని అన్నారు.

ఈమధ్య కొన్ని పాఠశాలల్లో ఆడపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు కథనాలు వినిపిస్తున్నందున సంబంధిత హెచ్ఎం వార్డెన్ లు పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యా దీవెన పథకం కింద వివిధ పాఠశాలల్లో చదివే గిరిజన బాలబాలికలకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ మంజూరు చేస్తున్నందున, హెచ్ఎం వార్డెన్ మీ పరిధిలోని పాఠశాలలకు వెళ్లి ప్రతి పిల్లలకు బ్యాంకు ఖాతా తెరిచే విధంగా అవగాహన కల్పించి దానికి సంబంధించిన వివరాలు డిడి ట్రైబల్ అధికారి కార్యాలయానికి పంపించాలని అన్నారు.ఈనెల 20వ తేదీ నాడు మరల హెచ్ఎం ,వార్డెన్ లకు సమావేశం నిర్వహిస్తానని ఎటువంటి పెండింగ్ అంశాలు లేకుండా 100% పూర్తయ్యేలా చూసి పూర్తిస్థాయి నివేదికలతో హాజరుకావాలని అన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem